శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 23:54:59

పవర్‌ఫుల్‌ పోలీస్‌

పవర్‌ఫుల్‌ పోలీస్‌

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విజయదశమి సందర్భంగా ఈ సినిమా ప్రకటన చేశారు. యువ దర్శకుడు సాగర్‌చంద్ర నిర్ధేశక బాధ్యతల్ని చేపడుతున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' చిత్రానికి రీమేక్‌ ఇదని సమాచారం. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు పవన్‌కల్యాణ్‌. ‘గబ్బర్‌సింగ్‌' తర్వాత ఆయన మరోమారు పోలీస్‌ పాత్రను పోషిస్తుండటం విశేషం. ‘పవన్‌కల్యాణ్‌తో మా సంస్థకిది తొలిచిత్రం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాం. అన్యాయాన్ని ఏమాత్రం సహించని పోలీస్‌ అధికారిగా పవన్‌కల్యాణ్‌ పాత్ర శక్తివంతంగా సాగుతుంది. అభిమానుల్ని అలరించే అన్ని అంశాలున్న కథాంశమిది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: తమన్‌, ఎడిటర్‌: నవీన్‌నూలి, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌, దర్శకత్వం: సాగర్‌ కె చంద్ర.