బుధవారం 03 జూన్ 2020
Cinema - Feb 12, 2020 , 23:08:25

పవన్‌తో తీన్‌మార్‌

పవన్‌తో  తీన్‌మార్‌

‘గబ్బర్‌సింగ్‌', ‘కాటమరాయుడు’ చిత్రాల్లో పవన్‌కల్యాణ్‌, శృతిహాసన్‌ జోడీ తమ కెమిస్ట్రీతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.   ముచ్చటగా మూడోసారి ఈ జంట వెండితెరపై సందడిచేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నది. మైత్రీ మూవీస్‌  సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల వెలువడింది. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ సరసన శృతిహాసన్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఈ సినిమాలో నటించడానికి శృతిహాసన్‌ సుముఖతను వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘క్రాక్‌' సినిమాతో తెలుగులో పునరాగమనం చేస్తున్నది శృతిహాసన్‌. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. 
logo