శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 23:56:20

వినోదం మాత్రమే కాదు

వినోదం మాత్రమే కాదు

‘గబ్బర్‌సింగ్‌' అద్వితీయ విజయం తర్వాత పవన్‌కల్యాణ్‌, దర్శకుడు హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బుధవారం ఈ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదలచేశారు.  ఈ పోస్టర్‌లో హర్లీడేవిడ్‌సన్‌ బైక్‌పై పెద్ద బాలశిక్ష బుక్‌, గులాబీ పువ్వుతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌, సుభాష్‌చంద్రబోస్‌ ఫొటోలు కనిపిస్తూ ఆసక్తిని పంచుతున్నాయి.  ‘ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదు..’ అనే క్యాప్షన్‌ కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం:అయానకబోస్‌.