టాలీవుడ్ (Tollywood ) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో మంచి అనుబంధం ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలకు ఒకరంటే మరొకరికి చాలా గౌరవం. సినీ పరిశ్రమలో ఉన్నవారిలో డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఉన్నపుడు చాలా సౌకర్యవంతంగా ఫీలవుతానని పవన్ కల్యాణ్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. తాను ఎంతగానో ఇష్టపడే త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే కొడుకు అకీరానందన్ (Akira Nandan) ను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేయాలనుకుంటున్నాడన్న వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
అకీరా కర్ర సాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అకీరా జూబ్లీహిల్స్ లోని ఇంట్లో పవన్ కల్యాణ్ తో కలిసి ఉంటున్నాడు. ఆరడుగుల 4 అంగుళాల ఎత్తుండే అకీరాకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నాడు పవన్ కల్యాణ్. దీని కోసం పవన్ ప్రత్యేకంగా ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ను కూడా పెట్టాడని అయితే కొడుకుకు వివిధ అంశాల్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పుడే అకీరాను లాంఛ్ చేసే ప్లాన్ ఏం పెట్టుకోలేదని టాక్. కెమెరా ఎదుటకు వచ్చే ముందే అకీరాకు అవసరమైన అన్ని శిక్షణలు ఇప్పించాలనుకుంటున్నాడట.
పవన్ కల్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని, వివిధ అంశాలపై అవగాహన పెంచుకున్న తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. ఇదే ఫార్ములాను కొడుకు విషయంలో కూడా అమలు చేస్తున్నాడు. అకీరాను లాంఛ్ చేసే బాధ్యతను త్రివిక్రమ్ కే అప్పగించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ టాక్. పవన్ కల్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తోపాటు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు.
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు