సెకండ్ ఇన్నింగ్స్లో మంచి జోరు మీదున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ తన 28వ సినిమా చేయనుండగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్త ఒకటి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. పవన్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ పోషించనున్నట్టు తెలుస్తుండగా, అందులో ఓ పాత్ర కొడుకుది కాగా, మరొక పాత్ర తండ్రి అని అంటున్నారు. చూడాలి మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో..!