పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గురువారం సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్ విలాసవంతమైన బైక్‌పై కూర్చొని ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.