అమరావతి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం బెనిఫిట్ షో ప్రదర్శించడంలో కొంత ఆలస్యం కావడంతో.. పవన్ అభిమానులు థియేటర్లలో వీరంగం సృష్టించారు.
తాజాగా విశాఖపట్నం జిల్లాలోని నార్పలలో కానిస్టేబుల్ పై పవన్ కళ్యాణ్ అభిమాని కత్తితో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నార్పలలోని శ్రీనివాస థియేటర్ వద్ద వకీల్ సాబ్ చిత్రం ప్రదర్శన సమయంలో యువకుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణను అదుపు చేయడానికి వెళ్ళిన గౌస్ అనే కానిస్టేబుల్ పై పవన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.