శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 16:15:26

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంద‌రినీ నిరాశ‌ప‌ర్చాడు: ప‌్ర‌కాశ్ రాజ్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంద‌రినీ నిరాశ‌ప‌ర్చాడు: ప‌్ర‌కాశ్ రాజ్‌

న‌టుడు, జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై బీజేపీకి మ‌ద్దతిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పై టాలీవుడ్ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్థిరత్వం లేని నిర్ణ‌యాలు తీసుకుంటూ ఊస‌ర‌వెల్లిలా మారిపోయారంటూ మండిప‌డ్డారు. ఓ టీవీ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌కాశ్ రాజ్ మాట్లాడుతూ..ప‌వ‌న్ క‌ల్యాణ్ అంద‌రినీ నిరాశ‌ప‌ర్చాడు. ఈ విష‌యం చెప్తున్నందుకు క్ష‌మించండి. తాను లీడ‌ర్ ను కాదన్న‌ట్టుగా ప‌వ‌న్ త‌న‌కు తాను అనుకుంటున్నారు.  గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీకి వ‌చ్చిన ఓటింగ్ శాతం ఎంత వ‌చ్చిందో తెలియ‌దా..? మీరు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డానికి ఎందుకు వెళ్తున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను  ప్ర‌శ్నించారు.

2014లో ప‌వ‌న్ ఎన్డీఏ త‌రుపున ప్ర‌చారం చేస్తూ..మోదీని గొప్ప వ్య‌క్తి అంటూ కొనియాడారు. కానీ 2019లో ఆ మాట‌లు ప‌క్క‌న పెట్టి లెఫ్ట్ పార్టీల‌తో క‌లిసి వెళ్లి..మోదీ, టీడీపీని విమ‌ర్శించారు. ఇక 2020 లో మ‌ళ్లీ బీజేపీతో క‌లిసి ముందుకొస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ఊస‌ర‌వెళ్లి త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని ప‌్ర‌కాశ్ రాజ్‌ వ్యాఖ్యానించారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.