శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 08:20:43

నోటితో డ్రాయింగ్‌.. ఫిదా అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

నోటితో డ్రాయింగ్‌.. ఫిదా అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ బ‌ర్త్ డే కావ‌డంతో ఆ రోజు ఆయ‌న అభిమానులు, జ‌న‌సైనికులు ప‌వ‌న్ పేరుతో అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ప‌వ‌న్‌పై త‌మ‌కున్న ప్రేమ‌ని నిరూపించుకున్నారు. ఇందులో భాగంగానే ఓ మ‌హిళా అభిమాని త‌న‌కు చేతులు లేక‌పోయిన కూడా నోటితో ఆర్ట్ వేసి ప‌వ‌న్‌పై త‌న‌కు ఎంత ప్రేమ ఉందో తెలియ‌జెప్పింది. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా స్వ‌ప్న అనే దివ్యాంగురాలు త‌న నోటితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటోని అద్భుతంగా డ్రా చేసింది. ఈ ఆర్ట్‌కి ఫిదా అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. త‌న‌ని త‌ప్ప‌క క‌లుస్తా అని మాట ఇచ్చారు. మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన  నా డ్రాయింగ్  నా దృష్టికి  మన జనసైనికులు తీసుకొచ్చారు, చాలా చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను.  జాగ్రత్త అమ్మ! అంటూ ప‌వ‌న్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 


logo