e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News ఈ సారి రాయ‌లసీమ స్లాంగ్‌లో అద‌ర‌గొట్ట‌బోతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఈ సారి రాయ‌లసీమ స్లాంగ్‌లో అద‌ర‌గొట్ట‌బోతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఈ సారి రాయ‌లసీమ స్లాంగ్‌లో అద‌ర‌గొట్ట‌బోతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

‘వకీల్ సాబ్’ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఈ సినిమా 5 రోజుల్లో 70 కోట్లకు చేరువలో వసూలు చేసింది. మరోసారి పవర్ స్టార్ రేంజ్ ఏంటి అనేది వకీల్ సాబ్ ప్రూవ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు మరో నాలుగు సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు ఈయన. వరస సినిమాలు చేస్తుండటంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడంటే ఐసోలేషన్ లో ఉండి కాస్త షూటింగ్ కు బ్రేక్ వచ్చింది కానీ లేదంటే కొన్ని రోజులుగా పగలు, రాత్రి షూటింగ్ చేస్తున్నాడు పవర్ స్టార్. ఓ వైపు క్రిష్ హరిహర వీరమల్లుతో పాటు మరోవైపు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి.

ఈ మధ్యే వకీల్ సాబ్ సినిమాలో తెలంగాణ యాసలో మెప్పించాడు పవర్ స్టార్. ఈ సినిమాలో పవన్ డైలాగులకు ఫ్యాన్స్ మెంటల్ ఎక్కిపోయారు. సూపర్ ఉమెన్ అంటూ సెకండాఫ్ వచ్చే డైలాగ్స్ కు ఫిదా అయిపోతున్నారు అభిమానులు. మరోవైపు ఇప్పుడు తెరకెక్కుతున్న అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ సీమ బిడ్డగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రాయలసీమ ప్రాంత వాసిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు .

పింక్ రీమేక్ వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు ఈ రీమేక్ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇందులో పవన్ రాయలసీమ యాసలో మాట్లాడతారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ డిక్షన్ కోసం ప్రముఖ రైటర్ పెంచల్ దాస్ దగ్గర శిక్షణ కూడా తీసుకుంటున్నాడు పవర్ స్టార్. ఈ రీమేక్ లో పవన్ ఒక పాట కూడ పాడనున్నాడు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ స్వయంగా ఖరారు చేసాడు. ఈ సినిమాకు పవన్ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. షూటింగ్ ఇప్పటికే 50 శాతం వరకు పూర్తైంది. ఇందులో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు.

Advertisement
ఈ సారి రాయ‌లసీమ స్లాంగ్‌లో అద‌ర‌గొట్ట‌బోతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement