బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 14:30:48

బ‌చ్చ‌న్ ఫ్యామిలీకి క‌రోనా సోకడంపై ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్

బ‌చ్చ‌న్ ఫ్యామిలీకి క‌రోనా సోకడంపై ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌కి లెక్క‌కి మంచిన అభిమానులు ఉన్నారు. కొంద‌రు స్టార్ హీరోలు కూడా బిగ్‌బీని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. అందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఒక‌రు. అమితాబ్ ఫ్యాన్‌గానే కాకుండా ఆయ‌న‌ని ఆరాధించే వ్య‌క్తిగా ప‌వ‌న్ .. బిగ్ బీ త్వ‌ర‌గా కరోనా నుండి కోలుకోవాల‌ని ప్రార్ధిస్తూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశాడు.

గౌరవ‌నీయులైన శ్రీ అమితాబ్ బ‌చ్చ‌న్ జీ, కూలీ సినిమా షూటింగ్‌లో మీకు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ఎంతో ఆందోళ‌న చెందాం. మా అమ్మ‌, నాన్న‌, ఫ్యామిలీ మొత్తం మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధించాం. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. అన్ని వ‌య‌స్సుల వారు మిమ్మ‌ల్ని ఎంత‌గానో ప్రేమిస్తారు. అమిత‌మైన ప్రేమ‌, విధేయ‌త‌, ఆప్యాయ‌త ఎప్పుడు చూపిస్తేనే ఉన్నారు. మీ ప్ర‌తిభ కాకుండా పోరాడే ప‌టిమ‌, గ‌ర్వంలేని ఉదార స్వ‌భావం వ‌ల‌న మిమ్మ‌ల్ని ఎంత‌గానో ప్రేమిస్తున్నాం. అభిషేక్ బ‌చ్చ‌న్‌కి కూడా కరోనా సోకింద‌ని తెలిసి చాలా బాధ‌ప‌డ్డాను. 

లార్డ్ ధ‌న్వంత‌రి శ‌క్తుల‌తో అభిషేక్, మీరు త్వ‌ర‌గా కోలుకోవాలి. ఆరోగ్యంగా తిరిగి రావ‌డాన్ని మేం చూడ‌ల‌నుకుంటున్నాం అని ప‌వ‌న్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  మొద‌టి నుండి బిగ్‌బీని ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైరా షూటింగ్ స‌మ‌యంలో హైద్రాబాద్‌కి వ‌చ్చిన అమితాబ్‌ని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి ఆయ‌న‌తో ఫోటోలు కూడా దిగిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo