మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 15, 2020 , 14:15:16

ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స‌రికొత్త రికార్డ్

ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స‌రికొత్త రికార్డ్

ఒక‌ప్పుడు సినిమాల ప‌రంగా రికార్డులు  గురించి మాట్లాడుకునే వారు. కాని ఇప్పుడు రోజులు మారాయి. సోష‌ల్ మీడియాలో రికార్డులు గురించి చ‌ర్చించుకుంటున్నారు. బ‌ర్త్‌డే ట్వీట్స్ లేదంటే లైక్స్, షేర్స్ ఇలా ఎంత ఎక్కువ వ‌స్తే అవి రికార్డులుగా చెబుతున్నారు. తాజాగా  ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరిట సోష‌ల్ మీడియాలో స‌రికొత్త రికార్డ్ న‌మోదైంది.

ఈ మ‌ధ్య కాలంలో అభిమానులు నెల రోజుల ముందు నుండే సోష‌ల్ మీడియాలో బ‌ర్త్‌డే హంగామా మొద‌లు పెడుతున్నారు. కామ‌న్ డీపీ, హ్యాష్ ట్యాగ్ సెట్ చేసి వాటితో విప‌రీతంగా షేర్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఆ మ‌ధ్య ఎన్టీఆర్ అభిమానులు ఇలానే చేయ‌గా, 21 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టేందుకు మ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ సిద్ధ‌మ‌య్యారు. పవన్ పుట్టిన రోజుకు 50 రోజులున్న నేపథ్యంలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అంటూ ఫ్యాన్స్  ట్రెండ్ మొదలుపెట్టారు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 27.5 మిలియన్ ట్వీట్లతో పాత రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo