శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 13:58:56

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన జ‌య‌ ప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అన్న వార్త విషాదకరం అని సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు అంటున్నారు. తాజాగా హీరో, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్దించారు. ఆయ‌న మ‌ర‌ణం న‌న్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయ‌న కుటుంబానికి నా త‌ర‌పున జ‌న‌సేన ప్ర‌క్షాన ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను.

రాయ‌ల‌సీమ మాండ‌లికాన్నిత‌న‌దైన బాణీని చూప‌డంలో జ‌య‌ప్రకాశ్ రెడ్డి సిద్ద‌హ‌స్తులు.నాట‌క రంగం నుండి వ‌చ్చిన ఆయ‌న హాస్య న‌టుడిగా, ప్ర‌తినాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్ష‌కుల‌ని మెప్పించారు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో పోలీస్ క‌మీష‌న‌ర్‌గా ఆయ‌న న‌టించారు. పాత్ర ఏదైన చ‌క్క‌గా ఒదిగిపోయేవారు. చిత్ర రంగంలో ఎంత బిజీగా ఉన్నా కూడా నాట‌క‌రంగాన్ని మ‌రువ‌లేదు. తెలుగు, సినీ నాట‌క రంగాల‌కు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మ‌ర‌ణం తీర‌ని లోటు అని ప‌వ‌న్ పేర్కొన్నారు.