‘యూటర్న్’ సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నాడు పవన్‌కుమార్. సమంత మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ డైరెక్టర్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో క్రైం థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు పవన్‌కుమార్. తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను అలరించిన అమలాపాల్ ఈ ప్రాజెక్టులో లీడ్ రోల్ చేస్తోంది.
ఈ వెబ్‌సిరీస్ టైటిల్ ‘కుడి ఎడమైతే’. యువ హీరో రాహుల్ విజయ్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ ప్రాజెక్టును అమలాపాల్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. ‘నా నెక్ట్స్ ప్రాజెక్టు ప్రకటించడం ఎక్జయిటింగ్ గా ఉంది. మీరు ఎదురుచూస్తుంటారని చెప్తున్నా’ అని అమలాపాల్ తెలిపింది. ఈ వెబ్‌సిరీస్‌లో అమలాపాల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. పోస్టర్లో అమలాపాల్, రాహుల్ విజయ్ ఎదురెదురు డైమెన్షన్ లో కనిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
అభిమానులు ఇంటికి రావడం నాకు నచ్చదు: రష్మిక
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్