శనివారం 30 మే 2020
Cinema - May 13, 2020 , 12:21:15

డ్రైవింగ్ లైసెన్స్‌పై క‌న్నేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

డ్రైవింగ్ లైసెన్స్‌పై క‌న్నేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత సినిమాల‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ని లైన్‌లో పెడుతున్నాడు. కొద్ది రోజుల‌లో పింక్ రీమేక్ చిత్రం వ‌కీల్ సాబ్ విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇక ఈ చిత్రాల త‌ర్వాత ప‌వ‌న్ ఏయే ప్రాజెక్టులు చేయ‌నున్నాడు అనే దానిపై ప‌లు రకాల వార్త‌లు వినిపిస్తున్నాయి.

తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ను తెలుగులో రవితేజతో కలిసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ప‌వ‌న్ ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాను బాబీ లేదా డాలీ డైరెక్ట్  చేసే అవకాాశాలున్నాయి. ఇక  మలయాళంలో సూపర్ హిట్టైన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాని కూడా ప‌వ‌న్ రీమేక్ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర రీమేక్ రైట్స్ రామ్ చ‌ర‌ణ్ ద‌క్కించుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, బాబాయ్ హీరోగా ఈ సినిమా చేయాల‌ని చెర్రీ భావిస్తున్నాడ‌ట‌.  మరి చ‌ర‌ణ్ కోరిక‌ని ప‌వ‌న్ తీరుస్తాడా, ఒక వేళ ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెబితే ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నే విష‌యంపై టాలీవుడ్ హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.


logo