క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి పావలా శ్యామలా. ఖడ్గం, ఆంధ్రవాలా, బాబాయ్ హోటల్, గోలిమార్ వంటి సూపర్ చిత్రాల్లో ప్రత్యేక నటనతో అశేష ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు పావలా శ్యామలా వయోభారం , సినిమా ఆఫర్స్ రాకపోవడంతో ఆమె ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. అప్పట్లో పావలా శ్యామలా పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కొంత ఆర్ధిక సాయం చేయగా, తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ కూడా వస్తుంది.
ఆర్ధిక కారణాల వలన పావలా శ్యామలా ఇంటితో పాటు తనకు వచ్చిన అవార్డుఉల కూడా అమ్ముకుంది. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటుంది. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల.అయితే ఆమెకు కరాటె కళ్యాణితో పాటు మా అసోసియేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాక ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయాలని కోరారు. పావలా శ్యామలాతో పాటు ఆమె కూతురు కూడా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం విదితమే.