గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 19:52:58

శ్రీకాంత్ హీరోయిన్ గా ప‌టాస్ బ్యూటీ

శ్రీకాంత్ హీరోయిన్ గా ప‌టాస్ బ్యూటీ

గ‌తేడాది మార్ష‌ల్‌, ఆప‌రేష‌న్ 2019 చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌. ఈ సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. ఈ యాక్ట‌ర్ తాజాగా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. మ‌ర‌ణ‌మృదంగం అనే టైటిల్ తో తెర‌కెక్కనున్న చిత్రంలో శ్రీకాంత్ హీరోగా న‌టించ‌నుండ‌గా..హీరోయిన్ గా ప‌టాస్ ఫేం శృతిసోధి ఎంపికైంది. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డికానున్నాయి.

మ‌రోవైపు క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ న‌టిస్తోన్న ప్రాజెక్టులో శ్రీకాంత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. చేత‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీలో శ్రీకాంత్ న‌టిస్తున్నాడా..? లేదా అనే విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.