శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 09:43:29

త‌న ప్రేయ‌సిని పెళ్ళాడ‌నున్న కుచ్‌కుచ్ హోతా హై న‌టుడు

త‌న ప్రేయ‌సిని పెళ్ళాడ‌నున్న కుచ్‌కుచ్ హోతా హై న‌టుడు

షారుఖ్ ఖాన్, కాజోల్ మరియు రాణి ముఖర్జీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సూపర్ హిట్ చిత్రం  కుచ్ కుచ్ హోతా హై చి. ఇందులో  సర్దార్‌గా పిల్లవాడి పాత్ర పోషించిన బాల నటుడు  పర్జాన్ దస్తూర్ ..తన ప్రేయసి డెల్నా ష్రాఫ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

28 ఏళ్ల పర్జాన్ దస్తూర్ తన ప్రియురాలిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో  వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించాడు. బీచ్‌లో డెల్నా ష్రాఫ్‌కు ప్ర‌పోజ్ చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ.. సంవ‌త్స‌రం క్రితం ఆమె అవును అని చెప్పిన అంద‌మైన రోజుకి సంబంధించిన ఫోటో ఇది. మా పెళ్ళికి ఇంకా నాలుగు నెల‌లు మాత్ర‌మే ఉంది అంటూ ప‌ర్జాన్ త‌న క్యాప్‌ష‌న్ లో రాసాడు.