బుధవారం 23 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 08:51:35

గుండెపోటుతో పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణి మృతి

గుండెపోటుతో  పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణి మృతి

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ర‌చ‌యిత‌లుగా త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పరుచూరి బ్ర‌ద‌ర్స్.  వీరిలో  పరుచూరి వెంకటేశ్వరరావు పెద్ద‌వారు కాగా, పరుచూరి గోపాలకృష్ణ చిన్న‌వారు. ఈ రోజు ఉద‌యం ప‌రుచూరి వెంకటేశ్వరరావు  స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74)   గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో పరుచూరి ఇంట విషాదం నెల‌కొంది. విజ‌య‌ల‌క్ష్మీ మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తూ, వెంక‌టేశ్వ‌ర‌రావుకి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నారు.

మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు. సోద‌రుడు పరుచూరి గోపాల‌కృష్ణ‌తో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. 1990ల అనంతరం తెలుగు సినీ రంగంలో, మరీ ముఖ్యంగా కమర్షియల్ సినిమాలలో, వారు ఎన్నదగిన విజయాలను అందుకున్నారు. అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల‌కి ‌ప‌ని చేసిన వీరు చివ‌రిగా చిరంజీవి నటించిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రానికి ప‌ని చేశారు.


logo