బుధవారం 03 జూన్ 2020
Cinema - May 03, 2020 , 09:37:04

వెయ్యి కేజీల బియాన్ని విరాళంగా అందించిన ప్ర‌ముఖ న‌టుడు

వెయ్యి కేజీల బియాన్ని విరాళంగా అందించిన ప్ర‌ముఖ న‌టుడు

క‌రోనా సంక్షోభం వ‌ల‌న ఇబ్బంది ప‌డుతున్న పేద ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు సినీ సెల‌బ్రిటీలు త‌మ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా త‌మిళ నటుడు పార్తీబ‌న్ వెయ్యి కేజీల రైస్‌ని విరాళంగా ఇచ్చారు. ఈ విష‌యాన్ని లారెన్స్ త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలిపారు. లారెన్స్ ఆక‌లితో అల‌మటిస్తున్న‌ పిల్ల‌ల‌ని, వృద్దులని ఆదుకునేందుకు నిత్యావ‌సర వ‌స్తువుల రూపంలో సాయం చేయాల‌ని కోరాడు. ర‌జ‌నీకాంత్ ముందుగా స్పందించి వంద బ‌స్తాల రైస్ పంపారు. అలానే క‌మ‌ల్, విజ‌య్, అజిత్,సూర్య‌ల‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా త‌మ‌వంతు సాయం చేయాల‌ని ఇటీవ‌ల పేర్కొన్నారు.

త‌న త‌ల్లి బ‌ర్త్ డే రోజు విషెస్ అందించిన పార్తీ బ‌న్ నా రిక్వెస్ట్‌ని స్వీక‌రించి వెయ్యి కేజీల రైస్ అందించారు. నా పై మా ఫ్యామిలీపై మీరు చూపిస్తున్న ఆద‌ర‌ణ‌కి కృత‌జ్ఞ‌త‌లు. మీరిచ్చిన బియ్యాన్ని మా టీం ఆక‌లితో అల‌మటిస్తున్న వారికి పంచుతుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ని త్వ‌ర‌లోనే మీకు పంపుతాం. మీరు నా స్నేహితుడు అని చెప్పుకోవ‌డం గ‌ర్వంగా ఉంద‌ని లారెన్స్ పేర్కొన్నాడు. అంతేకాక మిగ‌తా వారు కూడా మీకు తోచినంత సాయం చేయండి. చిన్న సాయం అయిన అది చాలా మంది ఆక‌లి తీరుస్తుంద‌ని లారెన్స్ స్ప‌ష్టం చేశారు.


logo