సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 17:46:11

టీవీ సీరియల్‌ నటుడికి కరోనా పాజిటివ్‌

టీవీ సీరియల్‌ నటుడికి కరోనా పాజిటివ్‌

ముంబై: స్టార్‌ప్లస్‌లో ప్రసారమవుతున్న సూపర్‌హిట్‌ సీరియల్‌ ‘కసౌటీ జిందగీ కే’ నటుడు పార్థ్‌ సంథాన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. సంథాన్‌ వారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌ అని తేలింది. దీంతో షూటింగ్‌ ఆపేశారు. తనతోపాటు షూటింగ్‌లో ఉన్నవారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సంథాన్‌ సోషల్‌ మీడియా ద్వారా కోరాడు. 

‘అందరికీ హాయ్‌. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నాకు స్వల్ప లక్షణాలున్నాయి. నాతోపాటు షూటింగ్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరూ దయచేసి పరీక్షలు చేయించుకోండి. ప్రస్తుతం నేను స్వీయనిర్భందంలో ఉన్నా. బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) సిబ్బంది నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. అవసరమైన సహాయం చేస్తున్న వారికి కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి ’ అని సంథాన్‌ పేర్కొన్నాడు.  బాలాజీ టెలీఫిల్మ్స్‌ సమర్పిస్తున్న ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్‌కు ఏక్తాకపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిందీలో ప్రసారమవుతున్న ఈ ధారావాహికకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo