మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 18:26:36

త‌ల్లిదండ్రుల సందేశం నాకు ప్రేర‌ణ క‌లిగించింది

త‌ల్లిదండ్రుల సందేశం నాకు ప్రేర‌ణ క‌లిగించింది

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్నస‌మ‌యంలో ఎంతోమంది సామాన్యుల‌కు అండ‌గా నిలిచాడు సోనూసూద్. రీల్ లైఫ్ లో విల‌న్ గా న‌టించి..రియ‌ల్ లైఫ్ లో హీరో అయ్యాడు. లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న మెడిక‌ల్ స్టూడెంట్స్ ను భార‌త్ కు తీసుకొచ్చాడు. మాస్కోలో చిక్కుకున్న మెడిక‌ల్ విద్యార్థుల కోసం స్పెష‌ల్ చార్టెడ్ ఫ్లైట్ ను బుక్ చేసి స్వ‌స్థ‌లం చెన్నైకి తీసుకొచ్చి..త‌ల్లిదండ్రుల ముఖాల్లో ఆనందంలో వెల్లివిరిసేలా చేశాడు. రీల్ లైఫ్ విన్ నుండి రియ‌ల్ లైఫ్ హీరోగా మారిన ఫీలింగ్ ఎలా ఉందంటూ ఇంట‌ర్వ్యూలో అడిగిన ప్ర‌శ్న‌కు సోనూసూద్ స‌మాధాన‌మిస్తూ..నేను ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడు పోషించ‌ని ఉత్త‌మ పాత్ర ఇది‌. నా జీవితంలో ఉత్త‌మ స్క్రిఫ్ట్ పూర్త‌యింది. విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి వ‌చ్చిన కృత‌జ్ఞ‌త‌ల సందేశం..నాలో మ‌రింత ప్రేర‌ణ క‌లిగించింద‌న్నాడు.

చిత్తూరు జిల్లాకు చెందిన రైతు కుటుంబానికి గంట‌ల వ్య‌వ‌ధిలోనే ట్రాక్ట‌ర్ ను ఇంటికి పంపించి..అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. యాదాద్రి భున‌న‌గిరి జిల్లాకు చెందిన ముగ్గురు అనాథ‌కు తాను అండ‌గా ఉన్నాన‌ని ముందుకొచ్చి అంద‌రి ప్ర‌శంస‌లు పొందాడు సోనూసూద్‌. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo