గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 29, 2020 , 09:38:55

మ‌హేష్ సినిమా కోసం మార్పులు మొద‌లు పెట్టిన ప‌ర‌శురాం

మ‌హేష్ సినిమా కోసం మార్పులు మొద‌లు పెట్టిన ప‌ర‌శురాం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడ‌ని ముందుగా వార్త‌లు వ‌చ్చాయి. కాని ప్ర‌స్తుతం ప‌ర‌శురాంతో చేసేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ట‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌ర‌శురాం ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ చిత్రంలో ఎక్కువ భాగాన్ని అమెరికాలో షూట్ చేయాల‌ని ముందుగా భావించారు. కాని క‌రోనా వ‌ల‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. అమెరికాలో షూటింగ్ చేయ‌క‌పోవ‌డంతో స్క్రిప్ట్‌లో కూడా మార్పులు చేస్తున్నార‌ట 

చిత్రంలో మ‌హేష్ స‌ర‌సన కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా,క‌న్న‌డ హీరో ఉపేంద్ర విల‌న్‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం.  చిత్రానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌లో నిజ‌మెంత ఉంద‌నేది రానున్న రోజులలో తేల‌నుంది. 


logo