ఆదివారం 23 ఫిబ్రవరి 2020
విజ‌య్ సినిమాకి కాపీ 'పారాసైట్‌': త‌మిళ నిర్మాత‌

విజ‌య్ సినిమాకి కాపీ 'పారాసైట్‌': త‌మిళ నిర్మాత‌

Feb 15, 2020 , 12:24:01
PRINT
విజ‌య్ సినిమాకి కాపీ 'పారాసైట్‌': త‌మిళ నిర్మాత‌

92వ ఆస్కార్డ్ అవార్డ్ వేడుక‌ల‌లో పారాసైట్ చిత్రం వీర‌విహారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడుతో పాటు మ‌రో రెండు విభాగాల‌లో ఆస్కార్డ్ అవార్డులు సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం విజ‌య్ న‌టించిన మిన్స‌ర క‌న్నా అనే త‌మిళ చిత్రానికి కాపీ అని త‌మిళ నిర్మాత పీఎల్ థెన‌ప్ప‌న్ అన్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్ సాయంతో కేసు ఫైల్ చేయ‌బోతున్న‌ట్టు ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. వారి సినిమాల‌ని ఇన్సిపిరేష‌న్ తీసుకొని ప్రాజెక్టులు చేస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మేం కూడా అదే చేయ‌బోతున్నాం అని నిర్మాత స్ప‌ష్టం చేశారు. 

మిన్స‌ర క‌న్నా చిత్రం కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా , ఇందులో రంభ‌, మోనిక కాస్టిలినో, ఖుష్బూ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రంలో విజ‌య్ కాసీ అనే డ్రైవర్ పాత్ర పోషించ‌గా, ఆయ‌న ధ‌న‌వంతుల ఇంట్లో కారు డ్రైవ‌ర్‌గా ప‌ని కుదుర్చుకుంటాడు. ఆ త‌ర్వాత త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని ఒక్కొక్క‌రిగా ఇంట్లోకి ప్ర‌వేశ పెడ‌తాడు. ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉండే ఈ చిత్ర క‌థ‌కి ఆస్కార్ రావ‌డం ఆనందాన్ని ఇచ్చింద‌ని నిర్మాత పేర్కొన్నారు. 


logo