గాయకుడు శ్రీకాంత్ సందుగు ఆలపించిన మ్యూజిక్ ఆల్బమ్ ‘పాప ఛలో హైదరాబాద్’. రజినీకాంత్ గంగవరపు నిర్మాత. ఆనంద్ భట్ దర్శకుడు. అభినయ్ టి.జె సంగీతాన్ని అందించారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను శనివారం హైదరాబాద్‌లో మంచు లక్ష్మి, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ సంయుక్తంగా విడుదలచేశారు. తాను ప్రేమించిన అమెరికా అమ్మాయిని ఇండియాకు తీసుకురావడానికి ఓ యువకుడు పడే తపనను సరదాగా ఆవిష్కరిస్తూ ఆల్బమ్‌లోని పాటలుంటాయని గాయకుడు శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్‌కు ఈ ఆల్బమ్ మంచి పేరు తీసుకురావాలని మంచు లక్ష్మి ఆకాంక్షించారు.