గురువారం 04 జూన్ 2020
Cinema - Jan 30, 2020 , 23:06:59

ఎవరూ చెప్పని కథ

ఎవరూ చెప్పని కథ

రక్షిత్‌, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరుణకుమార్‌ దర్శకుడు. జీఏ2యూవీ క్రియేషన్స్‌ సంస్థలు విడుదలచేస్తున్నాయి. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకురానున్నది. సినిమాలోని కొన్ని పాత్రలను యానిమేటెడ్‌ బుక్‌ రూపంలో చిత్రబృందం పరిచయం చేసింది. ఈ బుక్‌ను సోషల్‌మీడియా ద్వారా తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘పాత్రల పేర్లు, వేషభాషలు సహజంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రాలోని ఓ ప్రాంతంలో జరిగిన  కథ ఇది. సంభాషణలు రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా లోతైన అర్థంతో ఉన్నాయి. ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన యానిమేటెడ్‌ బుక్‌ ఆసక్తికరంగా ఉంది’ అని తెలిపారు.  ‘1978లో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అని నిర్మాత చెప్పారు. రఘుకుంచె, తిరువీర్‌, జనార్ధన్‌, లక్ష్మణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘుకుంచె, సినిమాటోగ్రఫీ: అరుల్‌ విన్సెంట్‌. logo