శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 00:21:30

పైడి జయరాజ్‌ జయంతి ఉత్సవాలు

పైడి జయరాజ్‌ జయంతి ఉత్సవాలు

తెలంగాణ ముద్దుబిడ్డ తొలితరం ఇండియన్‌ సూపర్‌స్టార్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్‌ 111వ జయంతి ఉత్సవాలు సోమవారం జై తెలంగాణ ఫిల్మ్‌ జేఏసీ ఛైర్మన్‌ పంజాల జైహింద్‌ గౌడ్‌ సారధ్యంలో తెలుగుఫిల్మ్‌ ఛాంబర్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పైడి జయరాజ్‌ భారతీయ సినిమాకు అందించిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయేందుకు తన వంతు కృషిచేస్తానని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. తెలంగాణలో సినిమా పరిశ్రమకు ఇచ్చే అవార్డులు పైడి జయరాజ్‌ పేరిట ఇవ్వాలని జైహింద్‌ గౌడ్‌ అన్నారు.   ఈ కార్యక్రమంలో  మోహన్‌, ప్రసన్నకుమార్‌, మోహన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.