నాగవర్మ బైర్రాజు, దివ్య సురేష్ జంటగా నటించిన చిత్రం ‘విక్రమ్’. హరిచందన్ దర్శకుడు. ఏబ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో ‘పడిపోయా.. పడిపోయా’ అంటూ సాగే రెండవ పాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేశారు. మ్యూజికల్ ప్రేమకథకు థ్రిల్లర్ అంశాలను జోడించి రూపొందించిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా వుంటుందని దర్శకుడు తెలియజేశారు.