టాలీవుడ్ (Tollywood) యాక్టర్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన చిత్రం ‘పాగల్'(Paagal). నరేశ్కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలవగా..ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. లవ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.
సెప్టెంబర్ 3నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Tollywood)లో పాగల్ సినిమా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి అమెజాన్ త్వరలో అధికారిక ప్రకటన కూడా చేయనుంది. పాగల్ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వందశాతం రావడం ఖాయమని ధీమాగా చెప్పాడు విశ్వక్ సేన్. కానీ థియేటర్లలోకి సినిమా వచ్చాక అతడి అంచనాలన్నీ తారుమారయ్యాయి.
విశ్వక్ సేన్ ప్రస్తుతం గామి అనే ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందీ చిత్రం. అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. లేహ్‌లోని పలు ప్రాంతాల్లోషూటింగ్ జరిపారు. విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర