శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 21:07:08

కాజ‌ల్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం: నిషా అగ‌ర్వాల్

కాజ‌ల్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం: నిషా అగ‌ర్వాల్

టాలీవుడ్ బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్ త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 30న గౌత‌మ్ కిచ్లూతో ఏడ‌డుగులు వేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో కాజ‌ల్ సోద‌రి నిషా అగ‌ర్వాల్ మీడియాతో మాట్లాడింది. అక్టోబ‌ర్ 29న మెహిందీ వేడుకల్ని నిర్వ‌హించ‌నున్న‌ట్టు చెప్పింది. కాజ‌ల్ పెళ్లి కోసం త‌మ కుటుంబం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నద‌ని పేర్కొంది. కోవిడ్ నేప‌థ్యంలో పెళ్లి వేడుక‌ను నిరాడంబ‌రంగా కొద్దిమంది స‌మ‌క్షంలో జ‌రుపున్న‌ట్టు చెప్పింది.

కోవిడ్  మార్గ‌దర్శ‌కాల‌ను పాటిస్తూ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ జ‌రిపేలా ప్లాన్ చేసుకుంటున్నాం. సంప్ర‌దాయం ప్రకారం హ‌ల్దీ, మెహిందీ వేడుక‌ల‌ను ఇంట్లోనే నిర్వ‌హిస్తాం. కాజ‌ల్ త‌న జీవితంలో కొత్త ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్ట‌బోతుంది. మేమంతా చాలా ఎక్స‌యిటింగ్ గా ఉన్నామ‌ని చెప్పుకొచ్చింది నిషా.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.