శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 19:07:52

‘ఓటిటి’ కాలం మొదలైందా..నెల రోజుల్లోపే ఒరిజినల్ ప్రింట్స్..!

‘ఓటిటి’ కాలం మొదలైందా..నెల రోజుల్లోపే ఒరిజినల్ ప్రింట్స్..!

ఇప్పుడు కాలం చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సినిమా విడుదలైన తర్వాత 40 నుంచి 60 రోజుల మధ్యలో ఒరిజినల్ ప్రింట్స్ విడుదలయ్యేవి. అమెజాన్, హాట్ స్టార్ లాంటి ఓటిటి సంస్థలు ఉన్నా కూడా కొత్త సినిమాలు కచ్చితంగా నెలన్నర తర్వాత విడుదల చేయాలనే కండీషన్ ఉండేది. కానీ ఇప్పుడు టైమ్ మారిపోయింది. ఏకంగా ఆన్ లైన్ లోనే సినిమాలు విడుదల చేసే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. కరోనా పుణ్యమా అని పెద్ద సినిమాలు కూడా నేరుగా ఇంటికే వచ్చేస్తున్నాయి. అలాంటిది చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. క్రిస్మస్ కు సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదలైంది. కానీ వారం రోజుల్లోనే ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ జీ స్టూడియోస్ లో విడుదల చేసారు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది.

జనవరి 13న విడుదలైన విజయ్ మాస్టర్ సినిమాను జనవరి 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేస్తున్నారు. అంటే సరిగ్గా 16 రోజుల్లోనే ఒరిజినల్ ప్రింట్ విడుదల చేస్తున్నారన్నమాట. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం షాక్ అవుతున్నారు. మరోవైపు రవితేజ క్రాక్ సినిమాను కూడా జనవరి 29నే ఆహా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. అయితే ఆ తేదీని డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఫిబ్రవరి 5కి మార్చినట్లు తెలుస్తుంది.

అలా చేసినా కూడా కేవలం 25 రోజుల గ్యాప్‌లోనే ఒరిజినల్ ప్రింట్ విడుదల చేసినట్లు అవుతుంది. మరోవైపు రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలను కూడా ఫిబ్రవరిలోనే ఓటిటి రిలీజ్ చేయనున్నారు. ఇవి మాత్రమే కాదు.. ఇకపై రాబోయే సినిమాలకు కూడా ఇదే జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటినుంచి ప్రతీ సినిమాను కూడా కేవలం నెల రోజుల్లోపే ఓటిటిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే థియేటర్స్ కు మరిన్ని కష్టాలు తప్పవు. ఎందుకంటే నెల రోజుల్లోనే సినిమా వస్తుందని తెలిసిన తర్వాత ఫ్యామిలీస్ థియేటర్స్ వైపు అడుగులు వేయడం కూడా తగ్గిపోతుంది.

ఇప్పటికే చాలా మంది సంక్రాంతి సినిమాలు బాగున్నాయని తెలిసినా కూడా థియేటర్స్ వైపు రాలేదు. దానికి కారణం కరోనా ఒకటైతే.. మరొకటి ఓటిటిలో వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనే నమ్మకం. ఇకపై కూడా ఇదే జరగబోతుందని తెలుస్తుంది. ఒకవేళ ఇదే సీన్ కానీ రిపీట్ అయితే కచ్చితంగా సినిమా థియేటర్స్ కు కాలం మరింత చెల్లినట్లే అవుతుంది. రాబోయే భారీ సినిమాలు వకీల్ సాబ్, ఆచార్య, రాధే శ్యామ్ కూడా కేవలం నెల రోజుల్లోనే ఓటిటి రిలీజ్ అయితే అభిమానులకు అంతకంటే పండగ చేసుకునే వార్త మరోటి ఉండదేమో..?

ఇవి కూడా చ‌ద‌వండి..

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా..'‌ ప్రీ రిలీజ్ బిజినెస్..!

హిట్ చిత్రాల దర్శ‌క‌నిర్మాత లైఫ్ జ‌ర్నీ..వీడియో

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo