గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 12:03:50

థియేట‌ర్ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన జ‌వ‌దేక‌ర్

థియేట‌ర్ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన జ‌వ‌దేక‌ర్

అన్‌లాక్ 5 మార్గదర్శకాల్లో భాగంగా ఈ నెల 15 నుండి థియేటర్లు ప్రారంభించడానికి కేంద్ర ప్ర‌భుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడపాలని, ప్రతి షోకు థియటర్ శానిటైజ్ చేయడం తప్పనిసరి అని    యజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది ప్ర‌భుత్వం. తాజాగా బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట‌ర్ ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ థియేట‌ర్స్‌లో ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలనే దానిపై వివ‌ర‌ణ ఇచ్చారు.

అక్టోబర్ 15 నుండి సినిమా హాళ్ళు, థియేటర్లు,మ‌ల్టీప్లెక్స్‌ల నిర్వహణ కోసం జారీ చేసిన మార్గదర్శకాలలో సామాజిక దూరం, థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు ప‌రిస‌రాల‌ని ప‌రిశుభ్రంగా ఉంచాల‌ని అన్నారు. దాదాపు ఏడు నెల‌లుగా థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డంతో వాటిని తిరిగి తెరిచే క్ర‌మంలో ప్ర‌జ‌ల భ‌ద్ర‌త కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి, ఏఏ విధానాలు పాటించాల‌నే విష‌యాలు వివరించారు. 

థియేట‌ర్‌లో పాటించాల్సిన నియ‌మాలు:

1. 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేట‌ర్స్  న‌డ‌పాలి

2. సీట్ల మధ్య కూడా భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి

3. మార్క్ చేసిన సీట్ల‌లో కూర్చోకుండా చూడాలి

4.హ్యాండ్ వాష్ శానిటైజ‌ర్స్ అందుబాటులో ఉండేలా చూడాలి

5. ప్ర‌తి ఒక్క‌రితో ఆరోగ్య సేతు యాప్ ఇన్‌స్టాల్ చేయించాలి.

6. థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌ని సరి. క‌రోనా ల‌క్ష‌ణాలు లేని వారిని మాత్ర‌మే అనుమ‌తించాలి

7. ఆరోగ్య స‌మ‌స్య‌లు ఏవైన ఉంటే సెల్ఫ్ మానిట‌ర్ చేయాలి

8. మ‌ల్టీ ప్లెక్స్‌ల‌లో స్క్రీనింగ్ టైమింగ్స్ వేరేలా ఉండే చూసుకోవాలి.

9. డిజిట‌ల్ పేమెంట్ కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాలి.

10. బాక్సాఫీస్, ఇత‌ర ప్రాంతాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశుభ్రంగా ఉంచాలి.

11. ప్రేక్ష‌కుల‌ని బ‌ట్టి కౌంట‌ర్స్ ని పెంచాలి

12. ఇంట‌ర్వెల్‌లో ప్రేక్ష‌కులు గుమిగూడ‌కుండా ఉండేలా చూడాలి.

13. ఫ్లోర్ మేక‌ర్స్ కూడా భౌతిక దూరం పాటించాలి. 

14. అడ్వాన్స్ బుకింగ్స్ ఏర్పాటు చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌జ‌లు గుమిగూడ‌కుండా ఉండేలా చూసుకోవాలి

15. ఉమ్మివేయడం నిషేదం

16. గాలి ఆడేలా ఏర్పాట్లు చేయాలి.

17. థియేట‌ర్ లోప‌ల ఫుడ్ డెలివ‌రీ చేయోద్దు, అలానే ప్యాకింగ్ ఫుడ్‌ని మాత్ర‌మే అనుమ‌తించాలి.

18. ఫుడ్ కౌంట‌ర్స్ కూడా ఎక్కువ‌గా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి

19. స్టాఫ్‌కు గ్లౌస్, షూట్స్, మాస్క్, పీపీఈ కిట్స్ వంటివి అందించాలి.

20. ఆడియ‌న్స్ కాంటాక్ట్ నెంబ‌ర్ కూడా తీసుకోవాలి.

21.వీలైన‌న్ని కౌంట‌ర్స్ ఏర్పాటు చేసేలా చూడండి

22.థియేట‌ర్ లో ఏసీ టెంప‌రేచ‌ర్ 24-30 మ‌ధ్య ఉండేలా చూడాలి.

23. షో ప్రారంభ‌మయ్యే ముందు, పూర్త‌య్యాక‌, ఇంట‌ర్వెల్ స‌మ‌యంలోను కోవిడ్ నిబంధ‌నల‌కు సంబంధించి అనౌన్స్‌మెంట్ ఇవ్వాలి.