శనివారం 30 మే 2020
Cinema - Apr 29, 2020 , 12:39:37

కరోనా ఎఫెక్ట్: ఆస్కార్ నిబంధనకు మినహాయింపు

కరోనా ఎఫెక్ట్: ఆస్కార్ నిబంధనకు మినహాయింపు

హైదరాబాద్: కరోనా కల్లోలం కారణంగా ఆస్కార్స్ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. లాస్ ఏంజెలిస్ థియేటర్లలో కనీసం వారంరోజుల పాటు ప్రదర్శించని సినిమాను అవార్డులకు పరిశీలించరు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు ఇప్పట్లో తెరిచే అవకాశం కనిపించడం లేదు. దాంతో థియేటర్ ప్రదర్శన నిబంధనను ప్రస్తుతానికి ఉపసంహరించినట్టు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. '93వ ఆస్కార్స్‌కు సంబంధించినంతవరకు తియేటర్ల నిబంధన తదుపరి నిర్ణయం వరకు నిలిపివేయబడుతుంది. నెట్ స్ట్రీమింగ్‌లో విడుదలైన చిత్రాలు సైతం పోటీకు అర్హత కలిగి ఉంటాయి' అని అకాడమీ పేర్కొన్నది. స్ట్రీమింగ్‌లో విడుదలైన సినిమాలు కూడా ఆస్కార్ నిబంధన మేరకు నామమాత్రంగా థియేటర్లలో విడదలయ్యేవి. ఇప్పుడిక ఆ అవసరం లేదు. చారిత్రిక విషాదమైన కోవిడ్-19 మహమ్మారి కారణంగా తాత్కాలికంగా ఈ నిబంధన నిలిపివేయాల్సి వచ్చిందని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్, సీఈవో డాన్ హడ్సన్ స్పష్టం చేశారు. థియేటర్లు తిరిగి తెరిచిన తర్వాత ఈ మినహాయింపు ఎత్తివేసే తేదీని ప్రకటిస్తారు.


logo