మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 00:09:55

బుజ్జిగాడి ప్రేమాయణం

బుజ్జిగాడి ప్రేమాయణం

రాజ్‌తరుణ్‌, మాళవికానాయర్‌, హేభాపటేల్‌ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకుడు.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఆహా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. నిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబ విలువలతో ముడిపడిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ఇది.  విభిన్నమైన కథాంశంతో దర్శకుడు విజయ్‌కుమార్‌కొండా ఈ సినిమాను తెరకెక్కించారు. నవ్విస్తూనే మనసుల్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. రాజ్‌తరుణ్‌, మాళవికానాయర్‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. వాణీవిశ్వనాథ్‌, నరేష్‌, పోసానికృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ఆండ్రూ ఐ.logo