ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 12:58:03

బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ

బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ

తెలుగు ఇండస్ట్రీపై ఇప్పుడు చాలా మంది కళ్లున్నాయి. ముఖ్యంగా ఇతర ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు మన సినిమాల వైపు చూస్తున్నారు. ఇప్పటి కథలు కాదు.. 10, 15 ఏళ్ల కింద వచ్చిన సినిమాలను కూడా వదలడం లేదు. మన దగ్గర ఎప్పుడో వచ్చిన వర్షం, ఠాగూర్ లాంటి సినిమాలు ఈ మధ్య బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. ఇప్పుడు చత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. వినాయక్ ఈ చిత్రాన్ని అక్కడ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా కూడా బాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. అప్పుడెప్పుడో 2011లో వచ్చిన ఎన్టీఆర్ సినిమాను ఇప్పుడు అక్కడ రీమేక్ చేస్తున్నారు. 2011లో జూనియర్ ఎన్టీఆర్ కు హిట్ రాలేదు కదా అనుకుంటున్నారా..? 

అవును ఫ్లాప్ సినిమానే ఇప్పుడు అక్కడ రీమేక్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఉసరవెల్లి కథ బాలీవుడ్ దర్శక నిర్మాతలకు బాగా నచ్చేసింది. అందుకే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. దీనికోసం ఆ సినిమా హక్కుల కోసం సంప్రదింపులు కూడా జరుపుతుంది. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే దూకుడు దెబ్బకు ఫ్లాప్ అయిపోయింది. అయితే స్టోరీలో పట్టుండడంతో బెంగాలీ నిర్మాతలు ఈ చిత్ర హక్కులను కొనుక్కొని రీమేక్ చేశారు. కానీ అక్కడ కూడా ఫ్లాప్ అయింది. 

ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఊసరవెల్లి వెళ్లనుంది. కాకపోతే అక్కడి ఆడియన్స్ అభిరుచుకి తగ్గట్లు ఈ చిత్ర కథలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ టిప్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే కాంచన రీమేక్ లక్ష్మీతో ప్రేక్షకులను పలకరించాడు అక్షయ్. ఇప్పుడు మరోసారి రీమేక్ కథనే నమ్ముకుంటున్నాడు. మరి చూడాలిక.. ఇక్కడ ఫ్లాప్ అయిన ఊసరవెల్లి బాలీవుడ్ లో ఎలాంటి రంగులు మార్చనుందో..?