నరేష్, దీపాలిశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించారు. వనపర్తి వెంకటరత్నం నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో టీజర్‌ను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదలచేశారు. ఈ సందర్భంగా హీరో నరేన్ మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. కులం, ఆస్తి అంతరాల్ని ఎదురించి ఓ ప్రేమజంట ఎలా ఏకమయ్యారన్నది ఆసక్తిని కలిగిస్తుంది’ అని తెలిపారు. సినిమాల్లో నటించాలనే తన కొడుకు కలను నిజం చేయడానికి రైతు అయిన వనపర్తి వెంకటరత్నం కష్టపడి ఈ సినిమాను నిర్మించారని త్రినాథరావు నక్కిన చెప్పారు. కథను నమ్మి చిత్రబృందం చేసిన కొత్త ప్రయత్నం ఫలించాలని బెక్కెం వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాసర్లశ్యామ్, సురేష్ గంగుల తదితరులు పాల్గొన్నారు.