బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 17:07:33

ఒకే యాక్టర్ తో సినిమా..ఒకే లొకేష‌న్ లో షూట్‌

ఒకే యాక్టర్ తో సినిమా..ఒకే లొకేష‌న్ లో షూట్‌

యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్ పార్దీప‌న్ కేవ‌లం ఓ పాత్ర‌తో సినిమా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఒథ సెరుప్పు టైటిల్ తో తీసిన త‌మిళచిత్రంలో పార్థీప‌న్ లీడ్ రోల్ పోషించాడు. తాజాగా ఇలాంటి మ‌రో ప్ర‌యోగాత్మ‌క సినిమాను మిథున్ జ్యోతి  (కేర‌ళ‌)అనే డైరెక్ట‌ర్ తీస్తున్నాడు. 18+ టైటిల్ తో రానున్న ఈ  చిత్రంలో  ఏకే విజుబ‌ల్  లీడ్ రోల్ చేస్తోంది. డ్రామా థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిస్తోన్న ఈ త‌ర‌హా చిత్రం మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలో తొలిసారి. 

మొత్తం 15 మంది సిబ్బంది ఈ సినిమా కోసం ప‌నిచేస్తుండ‌గా..అంద‌రూ 20 ఏండ్ల వ‌య‌స్సువారే కావ‌డం విశేషం. త్రివేండ్రంలోని ఒకే లొకేష‌న్ లో ఈ సినిమాను పూర్తి చేయనున్నార‌ట‌. సెప్టెంబ‌ర్ 4 నుంచి ఈ ప్ర‌యోగాత్మ‌క మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాలోని ఎర్ర‌ని మందార పువ్వుల మ‌ధ్య ఉన్న యువ‌తి స్టిల్ ఇప్ప‌టికే సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo