శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 14, 2020 , 17:27:27

ఇక‌పై ఆన్‌లైన్‌లోనే సెన్సార్.‌.!

ఇక‌పై ఆన్‌లైన్‌లోనే సెన్సార్.‌.!

క‌రోనా మ‌హ‌మ్మారి ఎఫెక్ట్‌తో సినీ పరిశ్ర‌మ‌కి సంబంధించి ప‌లు రూల్స్‌లో చాలా మార్పులు వ‌స్తున్నాయి. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అవార్డ్ వేడుక కూడా ఈ సారి వాయిదా ప‌డేలా క‌నిపిస్తుంది. అయితే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌లోను ప‌లు మార్పులు చేయాల‌ని సెన్సార్ బోర్డ్ భావిస్తుంద‌ట‌. లాక్ డౌన్ వ‌ల‌న సినిమాలు, షూటింగులు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులూ అన్నీ ఆగిపోయాయి. కొంద‌రు త‌మ సినిమాల‌ని ఓటీటీ ద్వారా విడుద‌ల చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. 

ఓటీటీ ద్వారా విడుద‌ల చేయాల‌న్నా కూడా సెన్సార్ త‌ప్ప‌ని స‌రి. ఈ నేప‌థ్యంలో జాతీయ‌ సెన్సార్ బోర్డ్ ఆన్‌లైన్‌లోనే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఓటీటీ విడుద‌ల చేసేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  ఇది వ‌ర‌కు సెన్సార్ జ‌రి‌గిన‌ప్పుడు నిర్మాత సెన్సార్ బోర్డు ముందు హాజ‌రుకావాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఆ నిబంధ‌న స‌డ‌లించారు. నిర్మాత సౌల‌భ్యాన్ని బ‌ట్టి.. సినిమా ఎక్క‌డ ప్ర‌ద‌ర్శించినా స‌రే, సెన్సార్ బోర్డు వ‌చ్చి సినిమా చూసి వెళ్తుంది. 

సినిమా చూసిన త‌ర్వాత సెన్సార్ బోర్డ్ ఈ మెయిల్ ద్వారా సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేస్తుంది. హార్డ్ డిస్క్‌, క్యూబ్ రూపంలో సినిమా పంపినా, సెన్సార్ బోర్డు చూసి,స‌ర్టిఫై చేస్తుంది. హైద‌రాబాద్ లో ఇక నుంచి ఈ విధానం ద్వారానే సినిమాల్ని సెన్సార్ చేయ‌బోతున్న‌ట్టు సెన్సార్ బోర్డు ప్రాంతియ అధికారి వి. బాల‌కృష్ణ తెలిపారు.

 


logo