శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 19, 2020 , 15:21:17

సైకిల్‌పై నాకూ అలా వెళ్లాలనిపిస్తోంది: అమితాబ్‌

సైకిల్‌పై నాకూ అలా వెళ్లాలనిపిస్తోంది: అమితాబ్‌

ముంబై: కరనా వైరస్‌ వ్యాప్తి వేళ లాక్‌డౌన్‌ కొనసాగించడంతో ఒక్కొక్కరు ఒక్కో రకంగా టైమ్‌ పాస్‌ చేస్తున్నారు. కొందరేమో తమ మేధోశక్తికి పదునుపెడుతున్నారు. కొత్త అందాలను కాన్వాస్‌పై తీర్చిదిద్దేందుకు మరికొందరు ఆరాటపడుతుండగా.. ఇంకొందరేమో పుస్తకాలు రాస్తూ కాలం  వెల్లదీస్తున్నారు. ఇలాఉండగా, వర్చువల్‌ టెక్నాలజీని మరింత అందంగా తీర్చిదిద్దిన ఓ వీడియో బాలీవుడ్‌ బాద్షా అమితాబ్‌ బచ్చన్‌ను కట్టిపడేసింది. ఆ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి 'తనకూ అలా సైకిల్‌పై వెళ్లాలనిపిస్తోంది'.. అని తన ఆతృతను వెలిబుచ్చారు. ఆ వీడియోను మీరూ చూసేసి అలా అలా విహరించి ఆనందించండి.


logo