శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 20, 2020 , 00:55:01

కోవిడ్‌ టైమ్‌ కహాని

కోవిడ్‌ టైమ్‌ కహాని

శీతల్‌భట్‌, సూరజ్‌పవన్‌ జంటగా ఏక్‌దో తీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మురళి బోడపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఒక అమ్మాయితో’ ‘కోవిడ్‌ టైమ్‌ కహానీ’ ఉపశీర్షిక. గార్లపాటి రమేష్‌, డా.వి.భట్‌ నిర్మిస్తున్నారు. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ‘ఈ కరోనా టైమ్‌లో 42 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం టాకీ పార్ట్‌ను పూర్తిచేసుకుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఆరోగ్యపరంగా కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా సింగిల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తిచేయడంతో అందరూ అభినందిస్తున్నారు’ అన్నారు. శ్రీరాగ్‌,గుర్లిన్‌ చోప్రా, రఘు కారుమంచి, అశోక్‌కుమార్‌ తదితరులు నటిసున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: తోట.వి.రమణ.