గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 11:53:41

సంప‌త్ ‌నంది కొత్త చిత్రం `ఓదెల రైల్వేస్టేష‌న్`

సంప‌త్ ‌నంది కొత్త చిత్రం `ఓదెల రైల్వేస్టేష‌న్`

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో `ఏమైంది ఈవేళ`‌, `బెంగాల్ టైగ‌ర్` వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో  శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ` ఓదెల రైల్వేస్టేష‌న్`. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. 

 హీరోగా ద‌య‌విట్టు గ‌మ‌నిసి, 8MM బుల్లెట్,  ఇండియా vs ఇంగ్లాండ్‌, మాయ‌బ‌జార్ 2016, వంటి హిట్ చిత్రాల‌తో పాటు  `కె.జి.ఎఫ్‌, మ‌ఫ్టీ, ట‌గ‌రు, గోధి బన్న‌సాధ‌ర‌న ‌మైక‌ట్టు, క‌వ‌చ‌, యువ‌ర‌త్న వంటి చిత్రాల్లో ప్ర‌ముఖ పాత్ర‌ల‌తో క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది. 

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేనర్‌లో మొద‌టిసారిగా ఈ చిత్రం ఫుల్ రియ‌లెస్టిక్ అప్రోచ్‌తో ఉండ‌బోతుంది. మేక‌ప్‌, డిఫ‌రెంట్ కాస్ట్యూమ్స్, డ్రీమ్ సీక్వెన్సెస్‌, సాంగ్స్ లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేకుండా పూర్తి న్యాచురాలిటీతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు ద‌ర్శ‌కుడు అశోక్ తేజ‌. `ఓదెల‌`అనే గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఒక‌ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రం రూపొంద‌నుంది. 

వ‌శిష్ట‌సింహ‌, హెబా ప‌టేల్, సాయిరోన‌క్, పూజితా పొన్నాడ‌, నాగ‌మ‌హేష్‌(రంగ‌స్థ‌లం ఫేమ్‌), భూపాల్‌, శ్రీ‌గ‌గ‌న్, దివ్య సైర‌స్‌, సురేంద‌ర్ రెడ్డి, ప్రియా హెగ్దె త‌దిత‌రులు న‌టిస్తోన్నఈ చిత్రానికి

సినిమాటోగ్ర‌ఫి: ఎస్. సౌంద‌ర్ రాజ‌న్‌,

సంగీతం: అనూప్ రూబెన్స్,

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు, 

ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌,

స‌మ‌ర్ఫ‌ణ‌:  శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్,

నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్,

క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: స‌ంప‌త్‌నంది,

ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ‌.


logo