గురువారం 01 అక్టోబర్ 2020
Cinema - Aug 04, 2020 , 20:14:41

‘ ప‌లాస’ ఫుల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది

‘ ప‌లాస’ ఫుల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది

ర‌క్షిత్, నక్ష‌త్ర కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం ప‌లాస 1978. శ్రీకాకుళంలోని ప‌లాస అనే గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌నల ఆధారంగా క‌రుణకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ర‌ఘు కుంచె న‌టిస్తూ..సంగీత స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ మూవీ ఆల్బ‌మ్ కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా ఈ మూవీలోని బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ సొగ‌స‌రి ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.

1970-80 బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాట‌లో రక్షిత్, న‌క్ష‌త్ర అల‌నాటి కాస్ట్యూమ్స్ లో త‌మ‌దైన హావ‌భావాల‌తో అంద‌రినీ అల‌రించారు. ల‌క్ష్మి భూపాల రాసిన ఈ పాట‌ను ఎస్పీ బాల‌సుబ్రహ్మ‌ణ్యం, బేబి పాడారు. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo