బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 19:20:48

చెల్లె నా కంటే బెట‌ర్: కృతి స‌న‌న్

చెల్లె నా కంటే బెట‌ర్: కృతి స‌న‌న్

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో వ‌న్ నేనొక్క‌డినే చిత్రంతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కృతి స‌న‌న్‌. ఆ త‌ర్వాత కృతి తెలుగు, హిందీ చిత్రాల్లో పెద్ద ప్రాజెక్టుల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇపుడు కృతి సోద‌రి నుపుర్ స‌న‌న్ కూడా సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసేందుకు సిద్దం అవుతుంది.

ఇటీవ‌లే నుపుర్ స‌నన్ ఓ ప్రైవేట్ సాంగ్ తో ప్రేక్ష‌కులను ప‌లుక‌రించగా..ఆ పాట వైర‌ల్ అయింది. దీంతో త‌న సోద‌రి నుపుర్ పై ప్ర‌శంస‌లు కురిపించింది కృతిస‌న‌న్‌. నుపుర్ నా కంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వ్య‌క్తి. ఖ‌చ్చితంగా నుపుర్ కెరీర్ లో అత్యున్న‌త స్థాయికి చేరుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది. మ‌రి నుపుర్ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏ స్థాయి వెళ్తుందో చూడాలి. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo