గురువారం 28 మే 2020
Cinema - May 02, 2020 , 13:25:48

బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ చిత్రం..!

బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ చిత్రం..!

బాలీవుడ్‌లో పీరియాడిక్ చిత్రాలు తెర‌కెక్కించ‌డంలో దిట్ట సంజయ్ లీలా భ‌న్సాలీ. ఆయ‌న తెర‌కెక్కించిన ప‌ద్మావ‌త్‌,భాజీరావు మ‌స్తానీ, దేవ‌దాస్‌, రామ్ లీలా చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. తాజాగా టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌తో భారీ పీరియాడిక‌ల్ మూవీ చేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఎప్ప‌టి నుండో సంజ‌య్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్లాన్ చేయ‌గా, తాజాగా కార్య‌రూపం దాల్చిన‌ట్టు తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మ‌రో విశేషం ఏంటంటే ఇందులో బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ నెగెటివ్ రోల్ చేయ‌నున్నాడ‌ట‌. ఇది ప్ర‌భాస్, రానా న‌టించిన మ‌రో బాహుబ‌లిలా ఉంటుందా అని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ చిత్రం చేయ‌నున్నాడు . వీటి త‌ర్వాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నున్న‌ట్టు టాక్.


logo