టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎంతోమంది కలుస్తారు. అయితే ఈసారి బ్యాండ్ బాయ్స్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలోని వివిధ మ్యూజిక్ బ్యాండ్స్ కి సంబంధించిన సింగర్లు, మ్యూజిషియన్లు ఎన్టీఆర్ ని కలుసుకొని ఫోటోలను షేర్ చేశారు. పూల చొక్కాతో నయా లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ ఫోటోలు అభిమానులను అలరిస్తున్నాయి. చొక్కా బటన్స్ విప్పేసి ఎన్టీఆర్ కనిపించిన తీరు చూస్తే వావ్ అనిపిస్తోంది.
ప్రస్తుతం తారక్ ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత కొరటాల శివతో సినిమా ఉంటుందని ప్రకటించాడు ఎన్టీఆర్. ఉగాది పండగ కానుకగా కొత్తసినిమా విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.