నందమూరి నటవారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడగుపెట్టిన ఎన్టీఆర్ తన నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించి అలరించనున్నాడు. రీసెంట్గా ఎన్టీఆర్‌కు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా, భీమ్‌కు బంగారం లాంటి మనసు ఉంటుందని, అయితే, తిరుగుబాటు మొదలు పెట్టాడంటే ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తాడని రాజమౌళి పేర్కొన్నారు.
ప్రతి సినిమాకు అశేష ప్రేక్షకాదరణ పెంచుకుంటూ పోతున్న ఎన్టీఆర్ తాజగా తన ట్విట్టర్లో సరికొత్త మైలురాయిని అందుకున్నారు. తాజాగా ఆయన ఫాలోవర్స్ సంఖ్య 5 మిలియన్స్‌కి చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాధారణంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. అప్పుడప్పుడు మాత్రమే పలకరిస్తుంటారు. అయినప్పటికీ ఆయనకు ఫాలోవర్స్ సంఖ్య క్రమక్రమేపి పెరుగుతూ పోతుంది.