బుధవారం 27 మే 2020
Cinema - May 08, 2020 , 10:10:30

ఎన్టీఆర్ ఔదార్యానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ఎన్టీఆర్ ఔదార్యానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాల‌ని చిన్నాభిన్నం చేసింది. రోజువారీ వేత‌నం పొందే కార్మికులు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటి వారికి త‌న వంతు సాయాన్ని అందించిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే వారికి కూడా కొండంత అండ‌గా నిలిచార‌ని స‌మాచారం.

ఎన్టీఆర్ త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే స్టాఫ్‌తో పాటు వారి కుటుంబాల‌కి అండగా నిలిచారు. స్టాఫ్ అంద‌రి‌కి అడ్వాన్స్‌ వేత‌నం అందించిన ఎన్టీఆర్ .. రానున్న‌రోజుల‌లో కూడా ఎలాంటి ఇబ్బంది వ‌చ్చిన కూడా మీ అంద‌రికి నా అండ త‌ప్ప‌క ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చార‌ట‌. ఎన్టీఆర్ ఔదార్యాన్ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో క‌లిసి సినిమా చేయ‌నున్నాడు


logo