శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 04, 2020 , 10:38:02

ఎన్టీఆర్ సాంగ్‌కి ‌జ‌ప‌నీస్ అదిరిపోయే స్టెప్స్‌

ఎన్టీఆర్ సాంగ్‌కి ‌జ‌ప‌నీస్ అదిరిపోయే స్టెప్స్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ విస్తృతంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌న దేశంతో పాటు విదేశాల‌లోను ఆయ‌న‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జ‌పాన్‌లో ఎన్టీఆర్‌ని చాలా ఇష్ట‌ప‌డ‌తారు. ఆయ‌న సినిమాల‌ని వీక్షించ‌డంతో పాటు పాట‌ల‌కి స్టెప్పులేస్తూ అల‌రిస్తూ ఉంటారు. తాజాగా అశోక్ సినిమాలోని పాట‌కి జ‌ప‌నీస్ జంట వేసిన స్టెప్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో 2006 లో వచ్చిన అశోక్ సినిమాలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి జంటగా నటించారు. ఆ మూవీలోని ‘గోలా గోలా’ సాంగ్ కి ఈ జపనీస్ జంట ఎన్టీఆర్ ఎనర్జీకి సమానంగా స్టెప్స్ వేసి అలరించారు. సోష‌ల్ మీడియాలో వారి డ్యాన్స్ వీడియో వైర‌ల్ అవుతుండ‌గా ఎన్టీఆర్, స‌మీరాని దింపేసారు అని కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే 


logo