ఈ మాయదారి కరోనా వైరస్ వచ్చి ఇలా అయిపోయింది కానీ లేదంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగేవి. అయితే ప్రత్యక్ష వేడుకలు లేకపోయినా తన సినిమాలతో అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పుట్టినరోజు సందర్భంగా ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అనేది ప్రేక్షకులు కూడా ఒక క్లారిటీ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లో ప్రభాస్ తర్వాత అన్ని వరస సినిమాలు చేస్తున్న హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఏ దర్శకుడిని వదిలి పెట్టకుండా అందరిని లైన్ లో పెడుతున్నాడు యంగ్ టైగర్. 2018లో అరవింద సమేత తర్వాత మరో సినిమా చేయని జూనియర్.. మరో మూడేళ్ల వరకు ఖాళీగా ఉండకుండా చూసుకుంటున్నాడు. 2024 వరకు వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది.
రాజమౌళితో ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు జూనియర్. ఈ సినిమా షూటింగ్ ఇదే ఏడాది పూర్తి కానుంది. సినిమా 2022లో విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ లైన్ లోకి రానున్నాడు. ఈ సినిమా కూడా త్వరగానే పూర్తి చేయాలని చూస్తున్నాడు తారక్. 2022 సమ్మర్ లో కొరటాల సినిమా విడుదల కానుంది. తన మార్క్ సందేశం ఉండేలా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఇందులో స్టూడెంట్ లీడర్ పాత్రలో యంగ్ టైగర్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇదే ఏడాది షూటింగ్ మొదలు కానుంది.
మరోవైపు ప్రశాంత్ నీల్తో ఓ పాన్ ఇండియన్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు తారక్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. 2022 చివర్లో సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీ సంచలన ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. దీన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, దిల్ రాజు సంయుక్తంగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న పరశురామ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక లైన్ సిద్ధం చేశాడు. 2023 లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు మొత్తానికి 6 సినిమాలతో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు జూనియర్.