యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఏదైన సర్ప్రైజ్ ఇస్తారా లేదా అనే అనుమానంలో అభిమానులు ఉండగా, వారందరిని ఉత్సాహ పరిచేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ విడుదల చేశారు. ఇందులో కొమురం భీంగా ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్ ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్స్‌లోకి తీసుకెళుతుంది.
రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు రెండేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019,2020 కాలెండర్ ఇయర్లో ఎన్టీఆర్ సినిమా అనేదే థియేటర్లోకి రాలేదు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2021లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనపడటం లేదు. కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడు కాలెండర్ ఇయర్స్‌లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి. అయితే అభిమానులని ఇంతగా వెయిట్ చేయించినందుకు రానున్న రోజులలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిచేందుకు జూనియర్ సిద్ధంగా ఉన్నాడు.